ఒత్తిళ్లకు లొంగొద్దు..నిజాయితీగా ఉండాలి : బుర్రా వెంకటేశం

ఒత్తిళ్లకు లొంగొద్దు..నిజాయితీగా ఉండాలి  :  బుర్రా వెంకటేశం

హైదరాబాద్, వెలుగు :  అధికారులు ఎవ్వరి ఒత్తిళ్లకు లొంగొద్దని, రూల్ ప్రకారమే పని చేయాలని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే.. తాను చెప్పినా సరే అది తప్పని చెప్పాలని, నిజాయితీగా ఉండాలని సూచిం చారు. ఎవ్వరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 

శుక్రవారం టెక్నికల్, కాలేజీ ఎడ్యుకేషన్ శాఖలతో పాటు రూసా నిధులపై నాంపల్లిలోని హయ్యర్ ఎడ్యుకేషన్ wకమిషనరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫైళ్లను పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టుకోవద్దని, ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలని సూచించారు. డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని, ఆ పోస్టులు నిండితే లెక్చరర్ల కొరత ఉండదన్నారు.