
మెహిదీపట్నం, వెలుగు: బస్సులో మంటలు చెలరేగి ఇంజిన్ సహా మందు భాగం కాలిపోయింది. మెహిదీపట్నం డిపోకు చెందిన బస్సు మంగళవారం ఉదయం 9.15 గంటలకు బాకారం వెళ్లి తిరిగి మెహిదీపట్నం వచ్చింది. పీవీ నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 12 వద్ద ప్రయాణికులను దించాక బస్సును పిల్లర్నంబర్9 వద్ద కాసేపు పార్క్ ఆపారు.
తిరిగి స్టార్ట్ చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ఫైర్సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు వచ్చేలోగా ఇంజిన్ తోపాటు ముందు మూడు సీట్ల వరకు బస్సు కాలిపోయింది. ఈ ఘటనతో కాసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.