జడ్చర్లలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొని ట్రావెల్స్ బస్సు నుజ్జు నుజ్జు...

జడ్చర్లలో ఘోర ప్రమాదం.. లారీని ఢీకొని ట్రావెల్స్ బస్సు నుజ్జు నుజ్జు...

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఘోర ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ట్రావెల్స్ బస్సు నుజ్జు నుజ్జయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా బస్సు డ్రైవర్ సహా ఇద్దరు మహిళా ప్రయాణికులు మృతి చెందారు. శుక్రవారం ( ఆగస్టు 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... జడ్చర్ల మండలం మాచారం దగ్గర 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది ఈ ప్రమాదం.

కడప నుంచి హైదరాబాద్ వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సు ముందుగా వెళ్తున్న లారీని ఢీకొని నుజ్జు నుజ్జయ్యింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మరో ఇద్దరు మహిళా ప్రయాణికులు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మృతి చెందిన మహిళా ప్రయాణికులు హైదరాబాద్ కూకట్ పల్లి ప్రణతానికి చెందినవారని.. కడపలో బంధువుల పెళ్ళికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.