11 నుంచి బిజినెస్ విమెన్ ఎక్స్‌‌‌‌పో

11 నుంచి బిజినెస్ విమెన్ ఎక్స్‌‌‌‌పో

హైదరాబాద్,వెలుగు: మహిళా ఆంట్రప్రెనూర్‌‌షిప్‌‌ను ప్రోత్సహించేందుకు కాన్ఫడరేషన్ ఆఫ్ విమెన్ ఎంట్రప్రినూర్స్ ఆఫ్ ఇండియా (కోవె) , ది ఇండస్ ఎంటర్‌‌ప్రెనూర్స్ (టై) హైదరాబాద్‌‌లో బిజినెస్ ఉమెన్ ఎక్స్‌‌పోను  నిర్వహిస్తున్నాయి. ఈ నెల 11, 12 , 13 తేదీల్లో - ఎక్స్‌‌పో ఉంటుంది. ఈ విషయమై కోవె నేషనల్ ప్రెసిడెంట్ వందనా మహేశ్వరి ‘వెలుగు’తో మాట్లాడుతూ ఈసారి 150 మందికి పైగా ఎంఎస్ఎంఈలు ఎక్స్‌‌పోలో స్టాల్స్ పెడతాయని, దాదాపు 15 వేల మంది వరకు విజిటర్లు రావొచ్చని భావిస్తున్నట్టు చెప్పారు. మహిళలు నిర్వహించే ఎంఎస్ఎంఈలే ఈ స్టాళ్లను ఏర్పాటు చేస్తాయని ప్రకటించారు. ‘‘ఈ ఎక్స్‌‌పో ద్వారా మహిళా ఎంట్రప్రినూర్లు తమ ఇన్నోవేషన్లను ప్రదర్శిస్తారు. ఇన్‌‌స్టంట్ ఫుడ్, హౌస్‌‌హోల్డ్ ప్రొడక్టులు, టెక్స్‌‌టైల్స్ వంటి ఎన్నో వినూత్న ప్రొడక్టుల ప్రదర్శనకు ఇది వేదిక అవుతుంది. వారికి  వ్యాపార అవకాశాలను సృష్టిస్తుంది.  నెట్‌‌వర్కింగ్‌‌ను సులభతరం చేస్తుంది. ఈ ఈవెంట్‌‌లో మూడు ప్రధాన సెషన్‌‌లను నిర్వహిస్తాం. మహిళా వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తులను ప్రదర్శించవచ్చు. ఇప్పటికే వ్యాపారం చేస్తున్న లేదా వ్యాపారం చేయాలనుకునే మహిళలు ఇందులో పాల్గొనడానికి రిజిస్టర్ చేసుకోవచ్చు.