వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రెండు మెడల్స్‌ ఖాయం

వరల్డ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో రెండు మెడల్స్‌ ఖాయం

హుయెల్వా (స్పెయిన్‌‌‌‌):  ఇండియన్‌‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్‌‌, లక్ష్యసేన్‌‌.. బీడబ్ల్యూఎఫ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో సంచలనం సృష్టించారు. మెన్స్‌‌ కేటగిరీలో రెండు మెడల్స్‌‌ను ఖాయం చేసి హిస్టరీ క్రియేట్‌‌ చేశారు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో శ్రీకాంత్‌‌ 21–8, 21–7తో మార్క్‌‌ క్లాజోవ్‌‌ (నెదర్లాండ్‌‌)పై గెలవగా, మరో మ్యాచ్‌‌లో లక్ష్యసేన్‌‌ 21–15, 15–21, 22–20తో జావో జంగ్‌‌ పెంగ్‌‌ (చైనా)ను ఓడించాడు. దీంతో సెమీస్‌‌కు చేరిన ఈ ఇద్దరికి మెడల్స్‌‌ ఖాయమయ్యాయి. అయితే శనివారం ఈ ఇద్దరి మధ్య జరిగే ఫస్ట్‌‌ సెమీస్‌‌లో గెలిచిన ప్లేయర్‌‌కు కనీసం సిల్వర్‌‌ మెడలైనా దక్కుతుంది. వరల్డ్​ చాంపియన్​షిప్​ మెడల్​ ఖాయం చేసుకున్న శ్రీ, లక్ష్యసేన్‌‌.. లెజెండరీ ప్లేయర్‌‌ ప్రకాశ్‌‌ పదుకోనే (1983 బ్రాంజ్‌‌), సాయి ప్రణీత్‌‌ (2019 బ్రాంజ్‌‌) సరసన చోటు సంపాదిస్తారు. ఇక విమెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో  డిఫెండింగ్​ చాంపియన్ ​ పీవీ సింధు 17–21, 13–21తో టాప్​సీడ్​ తై జు యంగ్‌‌ (చైనీస్‌‌ తైపీ) చేతిలో ఓడింది.  42 నిమిషాల మ్యాచ్‌‌లో తెలుగమ్మాయి... తై జు స్పీడ్‌‌ను అందుకోలేకపోయింది.  

శ్రీకాంత్‌‌.. సూపర్‌‌

మార్క్‌‌తో 26 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌లో వరల్డ్‌‌ 14వ ర్యాంకర్‌‌ శ్రీకాంత్‌‌ అదరగొట్టిండు. బలమైన స్మాష్‌‌లతో పాటు లాంగ్‌‌ ర్యాలీస్‌‌ ఆడుతూ అపోనెంట్‌‌ను ముప్పుతిప్పలు పెట్టిండు. దీంతో ఫస్ట్‌‌ గేమ్‌‌లో 11–5 లీడ్‌‌ సాధించిండు. ఆ తర్వాత మనోడి ఆట మరో స్థాయికి పెరిగింది.  బలమైన క్రాస్‌‌ కోర్టు విన్నర్స్‌‌ను రాబట్టిండు. దీంతో లీడ్‌‌ను 14–8కి పెంచుకున్నాడు. ఆ తర్వాత వరుసగా ఏడు పాయింట్లు సాధించి ఫస్ట్‌‌ గేమ్‌‌ను సొంతం చేసుకున్నడు. రెండో గేమ్‌‌లోనూ శ్రీకాంత్‌‌ కంప్లీట్‌‌గా డామినేట్‌‌ చేశాడు. 4–3 నుంచి వరుసగా ఏడు పాయింట్లు నెగ్గి లీడ్‌‌ను 11–3కు పెంచుకున్నాడు. స్కోరు 17–7 వద్ద వరుసగా మరో నాలుగు పాయింట్లు నెగ్గి గేమ్‌‌తో పాటు గ్రాండ్‌‌ విక్టరీని సాధించాడు. 

గేమ్‌‌ ఓడినా..

గంటా 7 నిమిషాల పాటు జంగ్‌‌ పెంగ్‌‌తో విపరీతంగా పోరాడి లక్ష్యసేన్​ విక్టరీ సాధించాడు. ఫస్ట్‌‌ గేమ్‌‌లో ఇద్దరు హోరాహోరీగా తలపడటంతో  ఓ స్టేజ్‌‌లో స్కోరు 13–13తో ఈక్వల్‌‌ అయ్యింది. ఈ దశలో లక్ష్య.. వరుసగా మూడు, రెండు, మూడు పాయింట్లు గెలిచి గేమ్‌‌ను చేజిక్కించుకున్నడు. రెండో గేమ్‌‌ స్టార్టింగ్‌‌లో మెరుగ్గా ఆడిన లక్ష్యసేన్‌‌.. 10–10తో స్కోరు సమం చేసిన తర్వాత కాస్త చతికిలపడిండు. దీంతో అపోనెంట్‌‌కు వరుసగా 5 పాయింట్లు ఇచ్చుకున్నడు. ఆ తర్వాత చెరో మూడు పాయింట్లు నెగ్గినా, లాస్ట్‌‌లో జంగ్‌‌ వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి గేమ్‌‌ను సాధించాడు. డిసైడర్‌‌ గేమ్‌‌లో ఇద్దరూ ప్రతీ పాయింట్‌‌ కోసం హోరాహోరీగా తలపడ్డారు. దీంతో స్కోరు 20–20తో ఈక్వల్‌‌ అయింది. కానీ లాస్ట్‌‌లో రెండు సూపర్‌‌ డ్రాప్స్‌‌తో లక్ష్య గెలిచాడు. మరో క్వార్టర్స్‌‌లో హెచ్‌‌.ఎస్‌‌. ప్రణయ్‌‌ 14–21, 12–21తో లో కెన్‌‌ యూ (సింగపూర్‌‌) చేతిలో ఓడాడు.