కేంద్రం మరో సంచలన నిర్ణయం.. ఇకపై డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్..!

కేంద్రం మరో సంచలన నిర్ణయం.. ఇకపై డీజిల్‌లో 15% ఐసోబ్యూటనాల్ బ్లెండింగ్..!

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్‌‌‌‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించగా, తాజాగా  డీజిల్‌‌‌‌లో 15 శాతం వరకు ఐసోబ్యూటనాల్  కలపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఐసోబ్యూటనాల్‌‌‌‌లో ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ. ఇంజన్‌‌‌‌కు ఇది అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఇది తక్కువ కార్బన్ ఎమిషన్స్‌‌‌‌ను విడుదల చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించగా, తాజాగా  డీజిల్‌లో 15 శాతం వరకు ఐసోబ్యూటానాల్  కలపాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇథనాల్‌ను నేరుగా డీజిల్‌తో కలపడం సాధ్యం కాదు. అందుకే ప్రత్యామ్నాయ ఇంధనం కోసం  ఇథనాల్ నుంచి ఐసోబ్యూటానాల్‌ను తయారుచేస్తున్నారు. 

ఐసోబ్యూటానాల్ డీజిల్‌కు సరైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుందని, దీనిని 15శాతం వరకు డీజిల్‌లో కలపడానికి ప్రభుత్వం పనిచేస్తోందని గడ్కరీ పేర్కొన్నారు.   కాగా,100 శాతం ఇథనాల్, ఐసోబ్యూటానాల్‌తో రెండు జనరేటర్ సెట్లను విజయవంతంగా నడిపారు. ఈ ఇంధనాలతో పనిచేసే ఇంజన్ల తయారీ సాధ్యమేనని దీని ద్వారా అర్థమవుతోంది.