హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్.. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఫ్రీ బస్సు

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేవారికి ఆర్టీసీ గుడ్ న్యూస్.. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు ఫ్రీ బస్సు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రజలకు ఆర్టీసీ యాజమాన్యం శుభవార్త చెప్పింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఉన్న బెంగళూరు ఆర్టీసీ బస్ పాయింట్ కు సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు చేరుకునేందుకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది. 

సికింద్రాబాద్, లింగంపల్లి, మియాపూర్ రూట్ల నుంచి శంషాబాద్ రూట్లలో ఈ ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటుంది. ఉచితంగా బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు తమ రిజర్వేషన్ టికెట్ ను చూపించాలి. సాయంత్రం 6 గంటల తర్వాత మాత్రమే ఈ రూట్లలో ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు.