బైజూస్‌‌‌‌‌‌‌‌ వాల్యూ బిలియన్ డాలర్లే !

బైజూస్‌‌‌‌‌‌‌‌ వాల్యూ బిలియన్ డాలర్లే !
  •      మరోసారి కంపెనీ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌ తగ్గించిన బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ :  ఒకప్పుడు 22 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ పలికన  ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్ కంపెనీ బైజూస్‌‌‌‌‌‌‌‌ పరిస్థితి మరింత దీనంగా మారింది. యూఎస్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ కంపెనీ బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్‌‌‌‌‌‌‌‌ మరోసారి ఈ కంపెనీ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌కు కోత పెట్టింది. ఈసారి బైజూస్ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌ కేవలం ఒక బిలియన్ మాత్రమేనని పేర్కొంది. ఇది పీక్‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌ 22 బిలియన్ డాలర్లతో పోలిస్తే 95 శాతానికి పైగా తక్కువ. కంపెనీ ఇప్పటికే  ఫండింగ్‌‌‌‌‌‌‌‌ పొందడంలో, లోన్లను తీర్చడంలో, ఉద్యోగులకు శాలరీస్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంలో ఇబ్బందులు పడుతోంది. 

టెక్‌‌‌‌‌‌‌‌క్రంచ్ రిపోర్ట్ ప్రకారం, కిందటేడాది అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాటికి  బైజూస్ షేరు వాల్యూని 209.6 డాలర్లుగా  బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్ నిర్ణయించింది. అంతకు ముందు ఏడాదిలో ఒక్కో బైజూస్ షేరు వాల్యూ 4,66‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌0 డాలర్లు పలికింది. ఈ విషయంపై బైజూస్ స్పందించలేదు. ఈ ఎడ్‌‌‌‌‌‌‌‌టెక్ కంపెనీలో బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్‌‌‌‌‌‌‌‌కు ఒక శాతం  కంటే తక్కువ వాటా ఉంది. వాల్యుయేషన్ లెక్కింపు ప్రాసెస్ ఇన్వెస్టర్ల మధ్య డిఫరెంట్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. బైజూస్ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌ను బ్లాక్‌‌‌‌‌‌‌‌రాక్ తగ్గించడం ఇదేమి మొదటి సారి  కాదు. కిందటేడాది కంపెనీ వాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌ను 8.4 డాలర్లకు తగ్గించింది. బైజూస్ వాల్యుయేషన్ 12 బిలియన్ డాలర్లు ఉన్నప్పుడు అంటే 2020 లో ఈ యూఎస్‌ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది.