హెల్మెట్ లేదు : ఫొటో తీశాడని హోంగార్డుపై దాడి

హెల్మెట్ లేదు : ఫొటో తీశాడని హోంగార్డుపై దాడి

హైదరాబాద్ : పబ్లిక్ లోనే ఓ పోకిరి రెచ్చిపోయాడు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారుడి ఫొటో తీసినందుకు హోంగార్డుపై దాడి చేశాడు. ఈ సంఘటన ఆదివారం నాంపల్లి దగ్గర జరిగింది. వివరాలు:  నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా డ్యూటీ చేసే జకీర్ హుసైన్..  ఆదివారం గాంధీ భవన్ రోడ్ లో విధులు నిర్వహిస్తున్నాడు. తాజ్ ఐలాండ్ దగ్గర ఓ యువకుడు హెల్మెట్ లేకుండా స్కూటీసై యూ టర్న్ చేశాడు. గమనించిన హోంగార్డు ఆ వాహనదారుడి (TS11EG7818) స్కూటీ ఫొటో తీశాడు. దీంతో సీరియస్ అయిన  వాహనదారుడు హోంగార్డు జకీర్ హుసైన్ పై దాడికి దిగాడు.

ఇటుకతో దాడి చేసి , అక్కడి నుండి పరారయ్యాడు. హోంగార్డుకు ఎడమచేతికి గాయమై , రక్తస్రావం అయ్యింది. వెంటనే వాహనదారుడిపై హోంగార్డు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు జకీర్. కేసు నమోదు చేసుకున్న నాంపల్లి పోలీసులు బండి నెంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. హోంగార్డును సమీప హస్పిటల్ కి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.