మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ వీరంగం

మద్యం మత్తులో క్యాబ్ డ్రైవర్ వీరంగం

రంగారెడ్డి జిల్లా శివారు రాజేంద్రనగర్ లో మద్యం మత్తు లో ఓ క్యాబ్ డ్రైవర్ వీరంగం సృష్టించాడు. ఈ మందు బాబు తప్ప తాగి క్యాబ్ నడపడమే కాకుండా.. శివరాంపల్లి రహదారిపై వెళ్తున్న వాహనాల పైకి క్యాబ్ ను ఎక్కించాడు. ఈ ఘటనలో నాలుగు వాహనాలు పాక్షికంగా ధ్వంసమైయ్యాయి..పలువురు గాయపడ్డారు. వాహనదారులు పరిపోతున్న క్యాబ్ డ్రైవర్ ను వెంబడించి పట్టుకున్నారు. 

ఆ డ్రైవర్ కు దేహశుద్ధి చేసి ట్రాఫిక్ పోలీసులకు అప్పగించారు. ట్రాఫిక్ పోలీసులు మందు బాబు క్యాబ్ డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించారు. దీంతో రీడింగ్ 170 క్రాస్ అయినట్లు చూపించింది. వేంటనే పోలీసులు ఆ క్యాబ్ ను సీజ్ చేసి డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాజేంద్రనగర్ పోలీసులు తెలిపారు.