
హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయ్యే ఫ్లైయర్‌లకు ఎక్కువ సమయం వేచి ఉండటం, అదనపు ఛార్జీలు, వైండింగ్ క్యూలు ఆనవాయితీగా మారాయి. క్యాబ్ డ్రైవర్లు తమ 'లో ఫెయిర్ నో ఎయిర్' క్యాంపెయిన్‌లో భాగంగా ప్రయాణికులను డ్రాప్ చేయడానికి నిరాకరిస్తున్నారు. క్యాబ్ లు విమానాశ్రయానికి వెళ్లడానికి, తిరిగి రావడానికి పేలవమైన ఛార్జీలకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచడానికి ఈ డ్రైవ్‌ను చేపట్టారు.
వారి ఛార్జీలు ప్రీపెయిడ్ టాక్సీల కంటే తక్కువగా ఉన్నాయని క్యాబ్ యజమానులు తెలిపారు. మరోవైపు ఈ ప్రచారం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. "నా ఫ్లైట్ కు ముందు.. నేను క్యాబ్ బుక్ చేసుకొని పికప్ పాయింట్‌కి వెళ్ళాను. అక్కడ చాలా క్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి కానీ తీసుకెళ్లేందుకు ఎవరూ లేరు. క్యాబ్ అగ్రిగేటర్‌లకు వ్యతిరేకంగా సమ్మె జరుగుతోందని, అలా అయితేనే తమకు రైడ్ వస్తుందని చెప్పారని హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఐటీ ప్రొఫెషనల్ పల్లబ్ దే చెప్పారు. తాను బుకింగ్‌ను రద్దు చేసి నేరుగా డ్రైవర్‌కు చెల్లిస్తానని, యాప్‌లో చూపించే ఛార్జీల కంటే రూ.500 ఎక్కువ చెల్లించమని తనను అడిగినట్టు చెప్పారు.
ఇది నిరసన కాదని, తమకు సరైన ధర లభించకపోవడం వల్లనే తాము రైడ్ లను రిజెక్ట్ చేస్తున్నామని తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్ ఫామ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అన్నారు. తాము 20 - 25కి.మీ రైడ్ కోసం కేవంల రూ.2నుంచి 3వందలు వసూలు చేస్తున్నామని, ఇది మామూలుగా ఇచ్చే నెలవారీ జీతాల కంటే చాలా తక్కువని చెప్పారు. విమానాశ్రయం నుంచి ప్రీపెయిడ్ ట్యాక్సీలకు తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన అదే రేట్లు.. రూ.143నుంచి రూ.2వేల 139వరకు ఉంటాయని తెలిపారు. కావున డ్రైవర్లతో చర్చలు జరిపి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలన్నారు.