
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అంతరిక్ష రంగంలో ఎఫ్ డీఐలకు ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 2024-25 (అక్టోబర్-సెప్టెంబర్) సీజన్‌లో చెరకు పంట ధరను క్వింటాల్ కు రూ. 315 నుంచి రూ. 340కి పెంచింది. అంటే 8 శాతం పెంపును కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం 5 కోట్ల మందికి పైగా చెరకు రైతులకు లాభం చేకూరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ ఈ నిర్ణయాలు తీసుకుంది.