- చైర్మన్‌గా మంత్రి ఉత్తమ్ కుమార్
హైదరాబాద్, వెలుగు: అర్హులకు రేషన్‌కార్డులు, హెల్త్‌కార్డులు ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు కావాల్సిన గైడ్ లైన్స్ రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీ వేసింది. ఈ మేరకు గురువారం జీవో జారీ చేసింది. ఈ కమిటీకి సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ కమిటీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. సివిల్ సప్లయ్స్ప్రిన్సిపల్ సెక్రటరీ కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తారు. కేబినెట్ సబ్ కమిటీ లబ్ధిదారులను గుర్తించేందుకు అర్హతలు, మార్గదర్శకాలను రూపొందించనుంది.
