నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్

నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్

ఇండియన్​ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచుల్లో 10+2 (బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద నాలుగేళ్ల బీటెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిగ్రీ కోర్సులో అడ్మిషన్స్​కు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

అర్హత :  కనీసం 70 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)ఉత్తీర్ణతతో పాటు జేఈఈ (మెయిన్) పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. 2 జనవరి 2005 నుంచి 1 జులై 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి.

సెలెక్షన్ :  జేఈఈ (మెయిన్) ర్యాంక్, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. ఆన్​లైన్​ దరఖాస్తులు జనవరి 6 నుంచి జనవరి 20 వరకు చేసుకోవచ్చు.  పూర్తి సమాచారం కోసం www.joinindiannavy.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.