2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని క్యాలెండర్ జారీ చేయాలి

2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని క్యాలెండర్ జారీ చేయాలి

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కేసీఆర్ ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు  కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని క్యాలెండర్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి అమలు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ రెండు నెలల క్రితం చెప్పారని..అది ఇంత వరకు అమలు కాలేదన్నారు.  నిరుద్యోగులకు భృతి ఇస్తేనే ప్రభుత్వం దివాళా తీస్తుందా అని ప్రశ్నించారు.

పీఆర్సీ ని ఎప్పుడు ముగిస్తుందో అప్పటి నుంచి అమలు చేస్తారు.. కానీ రెండేళ్లు గ్యాప్ వచ్చినా ఉద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారన్నారు జీవన్ రెడ్డి. కొత్త పీఆర్సీ ప్రకటనకు ముందు మధ్యంతర భృతి ఇవ్వడం ఆనవాయితీ అన్నారు. ఉద్యోగులు 2018 నుంచి 2021 వరకు  వాళ్ళ బెనిఫిట్స్ లాస్ అవుతున్నారని తెలిపారు. ఉద్యోగులకు ప్రస్తుతం రావాల్సిన బెనిఫిట్స్ 10 ఏళ్ల తర్వాత ఇస్తామని అనడం కరెక్ట్ కాదన్నారు.గడిచిన 33నెలల బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు వాస్తవాలను గ్రహించాలన్నారు.  దేశంలో ఎక్కడా 60 ఏళ్లకు పైగా ఉద్యోగుల వయోపరిమితి లేదన్న జీవన్ రెడ్డి.. tspsc చైర్మన్ లేకుండా ఏవిదంగా ఉద్యోగాల భర్తీ  చేస్తారని ప్రశ్నించారు.