త్వరలోనే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవర్ ప్యా క్డ్ గ్లింప్స్‌‌

త్వరలోనే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవర్ ప్యా క్డ్  గ్లింప్స్‌‌

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌‌సింగ్‌‌’.   షూటింగ్  పూర్తికాగా, ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్‌‌ వర్క్స్‌‌ జరుగుతున్నాయి.  మ్యూజికల్ ప్రమోషనల్స్‌ లో భాగంగా  ఇప్పటికే విడుదలైన రెండు పాటలు  సినిమాపై  క్యూరియాసిటీని  పెంచాయి. త్వరలోనే స్పెషల్ గ్లింప్స్‌‌ను రిలీజ్ చేయనున్నట్టు అప్‌‌డేట్ ఇచ్చిన మేకర్స్.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌‌ కొత్త పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు.  ఇందులో కౌబాయ్ తరహా గెటప్‌‌లో కనిపించిన పవన్‌‌.. స్టైలిష్‌‌ లుక్‌‌తో ఇంప్రెస్ చేస్తున్నారు.

 ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక త్వరలోనే 40 సెకన్ల పవర్‌‌‌‌ ప్యాక్డ్ గ్లింప్స్‌‌ను విడుదల చేయనున్నట్టు చెప్పిన టీమ్.. ఈ స్పెషల్ వీడియోలో  చిత్రంలోని స్థాయి, తీవ్రత, మాస్ ఎలిమెంట్స్‌‌ను ప్రేక్షకులకు చూపించనున్నట్టు తెలియజేశారు. శ్రీలీల, రాశిఖన్నా  హీరోయిన్స్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో పార్తిబన్, కె యస్ రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రావు రమేష్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.  మార్చి 26న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా రిలీజ్  కానుంది.