ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కాల్ సెంటర్

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న కాల్ సెంటర్
  • ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం ఇప్పిస్తామని యువతి వద్ద 8లక్షలు వసూలు
  • దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్: ఢిల్లీ కేంద్రంగా చేసుకుని కాల్ సెంటర్ నడుపుతూ ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సీసీఎస్, సైబర్ క్రైమ్ పోలీసులు నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి పక్కా సమాచారంతో దాడి చేశారు. కాల్ సెంటర్ లో 8 మందిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. ముఠా మోసాల  వివరాలను హైదరాబాద్ సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ వెల్లడించారు. 
షైన్ వెబ్ సైట్ లో హైదరాబాద్ కు చెందిన ఒక యువతి ఎయిర్ హౌసెస్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఈమెకు  జాబ్ ఇప్పిస్తామంటూ ఈ కాల్ సెంటర్ ముఠా 8 లక్షలు వసూలు చేసింది. మోసపోయిన సదరు యువతి ఫిర్యాదు చేయడంతో ఈ గ్యాంగు ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాలో ఐదుగురు యువతులు, ముగ్గురు యువకులు ఉన్నారు.  ఢిల్లీ కేంద్రంగా ఈ కాల్ సెంటర్ రాకెట్ నడుస్తోంది. ముఠాను విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ చెప్పారు. నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్స్,లాప్ టాప్ స్వాధీనం చేసుకున్నామన్నారు.