ప్రభుత్వాన్నికూలగొట్టాలని ఉక్రెయిన్ సైన్యానికి పిలుపు

 ప్రభుత్వాన్నికూలగొట్టాలని ఉక్రెయిన్ సైన్యానికి పిలుపు
  • రెండు వైపులా భీకర యుద్ధం.. బాంబులు, తుపాకుల మోత
  • కీవ్‌‌‌‌ను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ సోల్జర్ల పోరాటం
  • వెయ్యి మంది రష్యా సోల్జర్లను హతమార్చామన్న ఉక్రెయిన్
  • తమ వాళ్లు 137 మంది చనిపోయినట్లు వెల్లడి
  • 118 మిలటరీ టార్గెట్లను ధ్వంసం చేశామన్న రష్యా
  • చర్చలకు ఆహ్వానిస్తూనే.. ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ఉక్రెయిన్ సైన్యానికి పుతిన్ పిలుపు
  • చర్చలతో పరిష్కరించుకోండి.. పుతిన్​కు జిన్​పింగ్​ సూచన
  • యూరప్​లోని పుతిన్​ ఆస్తులను జప్తు చేసిన ఈయూ

కీవ్: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మరింత భీకరంగా సాగుతోంది. కీవ్, దాని చుట్టుపక్కల సిటీల్లో మిసైళ్ల వర్షం కురుస్తోంది. తుపాకుల మోత మోగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌‌‌‌ను అధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా రష్యన్ దళాలు ముందుకు సాగుతుండగా.. శత్రువులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం పోరాడుతోంది. కీవ్​ సిటీని చుట్టుముట్టిన రష్యా దళాలు లోనికి ఎంటరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.  యుద్ధంలో తమదే పైచేయి అంటూ రెండు దేశాలు ప్రకటించుకుంటున్నాయి. వెయ్యి మందికి పైగా రష్యన్ సోల్జర్లను హతమార్చామని ప్రకటించిన ఉక్రెయిన్.. తమ వాళ్లు 137 మంది చనిపోయినట్లు వెల్లడించింది. 118 మిలటరీ టార్గెట్లను ధ్వంసం చేసినట్లు రష్యా చెప్పుకొచ్చింది. ముందు చర్చలకు సిద్ధమేనని ఆఫర్ ఇచ్చిన రష్యా.. తర్వాత ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చాలంటూ ఆ దేశ ఆర్మీకి పిలుపునిచ్చింది. కీవ్‌‌‌‌ను అధీనంలోకి తెచ్చుకుని, తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు పుతిన్ ప్లాన్ చేశారని, నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ రాజధానిని రష్యా స్వాధీనం చేసుకోవచ్చని అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది.

రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు తీవ్రంగా పోరాడుతున్నాయి. పైకి రష్యా బలమే కనిపిస్తున్నా.. ఉక్రెయిన్ ఎదుర్కొంటున్న తీరు అసాధారణంగా ఉంది. కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఉత్తారన 15 మైళ్ల దూరంలో ఉన్న ఆంటోనోవ్ విమానాశ్రయంలో రష్యాకు చెందిన 20 అటాక్ హెలికాప్టర్లు గురువారం ల్యాండ్ అయ్యాయి. అయితే ఉక్రేనియన్ జాతీయ గార్డు యూనిట్లు.. భారీ పోరాటం తర్వాత రాత్రి సమయంలో ల్యాండింగ్ స్ట్రిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిరిగి అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఈ పరస్పర దాడుల్లో పలువురు రష్యన్ సైనికులు చనిపోగా, మిగిలిన వాళ్లు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలకు పారిపోయారు. కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉక్రెయిన్ ఆర్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్సెస్.. రష్యన్ జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూల్చివేయడం కనిపించింది. ఉత్తరాన బెలారస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రెండు మార్గాల్లో చొచ్చుకొచ్చేందుకు రష్యన్లు ప్రయత్నిస్తుండగా.. ఇవాంకివ్ దగ్గర బ్రిడ్జిని ధ్వంసం చేశామని, అక్కడే వారిని నిలువరించామని ఉక్రెయిన్ ప్రకటించింది. ఇవాంకివ్, చెర్నిహివ్ నుంచి కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ట్యాంకులతో ఎంటర్ అవ్వాలని శత్రువులు ప్రయత్నిస్తున్నారని, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైళ్లతో రష్యాన్ ట్యాంకర్లను పేల్చి వేస్తామని ఉక్రెయిన్ హోం మంత్రి ఆంటోన్ చెప్పారు. ఈశాన్యంలో సుమీ నుంచి మరో రష్యన్ గ్రూపు కీవ్ వైపుగా సాగుతున్నది. క్రూయిజ్ లేదా బాలిస్టిక్ మిసైళ్ల దాడులు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్​  ప్రెసిడెంట్ అడ్వైజర్ చెప్పుకొచ్చారు. మరోవైపు నేషనల్ గార్డ్ ట్రూప్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఉక్రెయిన్ దళాలు కీవ్ వీధుల్లో పహారా కాస్తున్నాయి. తమ రాజధానిని కాపాడుకునేందుకు మొత్తం హైవే అంతటా డిఫెన్సివ్ పొజిషన్లలో ఉన్నాయి. ఇప్పటికే రష్యన్ ఆర్మీ కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అయింది. అయితే కచ్చితంగా ఎంత మంది, ఎక్కడున్నారనేది మాత్రం క్లారిటీ రాలేదు. వొర్జెల్, బుచా, ఇర్పెన్ జిల్లాలు, బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దగ్గర్లోని సుమీ సిటీలోకి రష్యన్ దళాలు ఎంటరయ్యాయి. కీవ్ సిటీ శివార్లలోని ఒబోలోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు దేశాల సైనికుల మధ్య ఫైటింగ్ జరుగుతోంది. తూర్పున ఉన్న కొనోటాప్ నుంచి రాజధానిపైకి రష్యన్ సైనికులు దూసుకుపోతున్నారు. అయితే చెర్నిహివ్ నగరంలో ఉక్రెయిన్ సైనికుల నుంచి భారీ ప్రతిఘటన ఎదుర్కొన్నారు. చెర్నిహివ్ చుట్టూ ఉన్న రష్యన్ బలగాలపై విరుచుకుపడ్డామని, 30కి పైగా ట్యాంకులను నాశనం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. 

2,800 మంది రష్యా సైనికులు హతం ?
చాలా వరకు ఉక్రెయిన్ ఎయిర్ బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మిలటరీ బిల్డింగులు, డ్రోన్లను నాశనం చేశామని రష్యా రక్షణ శాఖ చెబుతోంది. తమ ఎస్​యూ 25 అటాక్ జెట్.. పైలట్ తప్పిదం వల్ల, ఏఎన్26 ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేన్.. సాంకేతిక సమస్య వల్ల కూలిపోయినట్లు పేర్కొంటోంది. సిటీలను టార్గెట్ చేయడం లేదని రష్యా చెబుతుండగా, ప్రజలు ఉండే ఏరియాల్లో విధ్వంసం జరుగుతోందని ప్రత్యక్షంగా చూస్తున్న జర్నలిస్టులు చెబుతున్నారు. వెయ్యి మందికి పైగా రష్యా సోల్జర్లను చంపినట్లు ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ ప్రకటించింది. కానీ ఇప్పటిదాకా 2,800 మందిని చంపామని, 80 ట్యాంకులను నాశనం చేశామని డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ హన్నా మాల్యర్ చెప్పారు. 516 సాయుధ వాహనాలు, 10 ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్టులు, 7 హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్టు చేశారు. తొలి రోజే 100 మందికి పైగా ఉక్రెయిన్​ ప్రజలు చనిపోయినట్లు సమాచారం. 118 మిలటరీ టార్గెట్లను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది.

కీవ్ శివార్లలో రష్యన్ గూఢచారులు
కీవ్ సిటీ శివార్లలో వ్యూహాత్మక ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. హోస్టోమెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని విమానాశ్రయాన్ని తమ కంట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చుకున్నట్లు చెప్పింది. ఇక్కడ అతిపెద్ద రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే ఉంది. దీంతో భారీ రవాణా విమానాలు ఇక్కడికి ఈజీగా చేరుకునేందుకు అవకాశం వచ్చింది. కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ సిటీ చాలా దగ్గర్లో ఉంది. మరోవైపు రష్యన్ గూఢచారులు, విధ్వంసక సైనికులు కీవ్ శివార్లలో కనిపించారు. ఉక్రెయిన్ ఆఫీసర్లను గుర్తుపట్టి చంపేందుకు చెచెన్ స్పెషల్ ఫోర్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని హంటర్ల టీమ్ రంగంలోకి దిగింది. కొందరు ఆఫీసర్ల వివరాలు, ఫొటోలను వారికి రష్యన్ ఆఫీసర్లు ఇచ్చారు.

చెర్నోబిల్​లో రేడియేషన్ పెరిగింది
ఉక్రెయిన్‌‌లోని చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం ప్రాంతాన్ని రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ రేడియేషన్ స్థాయిలు పెరిగాయని శుక్రవారం ఉక్రెయిన్ అణుఇంధన నియంత్రణ సంస్థ వెల్లడించింది. చెర్నోబిల్ జోన్ లో గామా రేడియేషన్ స్థాయిలు ప్రస్తుతం సాధారణం కంటే ఎక్కువగా పెరిగినట్లు గుర్తించామని తెలిపింది. 1986లో న్యూక్లియర్ రియాక్టర్ పేలి, యూరప్ అంతటా రేడియేషన్ వ్యాపించింది. దెబ్బతిన్న రియాక్టర్ ను ప్రొటెక్టివ్ షెల్ తో కప్పేసి, అప్పటి నుంచి దానిని మూసివేశారు. ఈ ప్లాంటును రష్యన్ బలగాలు గురువారం స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత బలగాల కవాతు, మిలిటరీ వెహికల్స్ సంచారం, ఇతర కార్యకలాపాల వల్ల ఇక్కడ మట్టి నుంచి రేడియోయాక్టివ్ ధూళి గాలిలోకి కలుస్తోందని చెప్తున్నారు. అయితే, తమ బలగాలు చెర్నోబిల్ ప్రాంతానికి కాపలా కాస్తున్నాయని, ప్రస్తుతం ఇక్కడ రేడియేషన్ లెవల్స్ సాధారణంగానే ఉన్నాయని రష్యా రక్షణ శాఖ అధికారులు తెలిపారు.  

రాత్రంతా బిక్కుబిక్కుమంటూ..
కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రజలంతా గురువారం సాయంత్రానికి అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లకు చేరుకున్నారు. ప్రజలంతా సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే స్టేషన్లలో తలదాచుకున్నారు. పిల్లలతో వెళ్లి.. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. సబ్ వే స్టేషన్ల నుంచి జనాలు బయటికి రావద్దని, ఫైరింగ్ జరుగుతోందని ప్రజలకు పోలీసులు చెప్పారు. యుద్ధం వస్తదని, కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకుంటారని ఎన్నడూ అనుకోలేదని ఆంటోన్ మిరోనోవ్ అనే పౌరుడు వాపోయాడు. కీవ్​లో శుక్రవారం కూడా సైరన్లు మారుమోగాయి. హోటళ్లు, అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లలో ఉన్న వాళ్లను బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ షెల్టర్లకు తరలించారు. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ఆఫీసులో గురువారం నుంచీ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. 

137 మంది హీరోలు చనిపోయిన్రు: జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ
10 మంది మిలిటరీ ఆఫీసర్లు సహా మొత్తం 137 మంది హీరోలు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ ప్రకటించారు. దాదాపు 316 మంది గాయపడ్డారని తెలిపారు. ఇందులో జ్మిన్యి ఐల్యాండ్, ఒడెస్సా రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చనిపోయిన బార్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గార్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్నారు. ‘‘వాళ్లు ప్రజలను చంపుతున్నారు. శాంతియుతంగా ఉన్న సిటీలను మిలిటరీ టార్గెట్లుగా చేసుకుంటున్నారు. ఇది చాలా పెద్ద తప్పు. ఎన్నటికీ క్షమించబోం’’ అని జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ అన్నారు. 

పుతిన్ ప్లాన్ ఇదేనా?
నాలుగు రోజుల్లోగా కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకునేలా రష్యా ముందుకు సాగుతున్నట్లుగా అమెరికా ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. కీవ్ ముట్టడిలో ఉందని, తన సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నారని అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. రష్యా ప్రత్యేక దళాలు కీవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చుట్టుముట్టిన తర్వాత.. లోపలికి వెళ్లి -సికోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ లేదా బోరిస్పిల్ విమానాశ్రయాలను స్వాధీనం చేసుకుంటాయని అమెరికా ఇంటెలిజెన్స్ భావిస్తోంది. అప్పుడు 10,000 మంది పారాట్రూపర్లతో అక్కడ ల్యాండ్ అయి.. దాడి చేసే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. ‘‘పారాట్రూపర్లు ఎంటరయ్యాక ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్కీ, మంత్రులు, ఎంపీలను వెతికి పట్టుకుంటారు. వారు దొరికాక బలవంతంగా అయినా సరే.. దేశాన్ని కంట్రోల్ చేసే శక్తిని రష్యాకు అప్పజెప్పడం లేదా మాస్కో చెప్పుచేతల్లో ఉండే వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించేందుకు సంబంధించిన శాంతి ఒప్పందం మీద సంతకం చేయిస్తారు. మొత్తం దేశాన్ని స్వాధీనం చేసుకోవడం, ఆక్రమించుకోవడం అనే కష్టమైన, రక్తపాతంతో కూడుకున్న పని చేయాల్సిన అవసరం లేకుండానే యుద్ధాన్ని ముగిస్తారు!!” అని పేర్కొంది.