
ఉప్పల్, వెలుగు : పోలింగ్ తేదీకి టైమ్ దగ్గర పడుతుండటంతో ఉప్పల్ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. నెలరోజులుగా ప్రచారానికి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్న ఆయన.. సెగ్మెంట్ లోని 10 డివిజన్లను మరోసారి చుట్టేసేందుకు సిద్ధమయ్యారు. శనివారం రామంతాపూర్ డివిజన్ లో ఆయన ప్రచారం నిర్వహించారు.
మహిళలు మంగళ హారతులతో బండారి లక్ష్మారెడ్డికి స్వాగతం పలికారు. బీఆర్ఎస్ అభివృద్ధి, మేనిఫెస్టోను ఆయన జనాలకు వివరించారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. చర్లపల్లి డివిజన్ లోనూ కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం చేశారు. దారిపొడవునా జనం ఆయనకు ఘన స్వాగతం పలికారు.