
‘కిల్’ సినిమాలో హీరో లక్ష్య్ తో పోటాపోటీగా నటించి విలన్‌గా మెప్పించాడు రాఘవ జుయల్. రీసెంట్‌గా అదే హీరోకి ఫ్రెండ్‌గా ‘ది బ్యాడ్స్ బాలీవుడ్’లోనూ ఆకట్టుకున్నాడు. ఇప్పుడీ బాలీవుడ్ టాలెంటెండ్ యాక్టర్ నాని సినిమా ‘ది ప్యారడైజ్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇటీవల దర్శకుడితో కలిసి స్క్రిప్ట్ రీడింగ్ సెషన్‌లో పాల్గొన్న రాఘవ జుయల్.. అందులోని రా సీన్స్ చూసి ఎక్సైటింగ్‌గా ఫీలయ్యాడు. త్వరలోనే తను సెట్స్‌లో జాయిన్ అవబోతున్నాడు.
ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూస్‌లోనూ ఈ సినిమా గురించి ఓ స్థాయిలో చెప్పుకొచ్చాడు రాఘవ. ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లోనూ విడుదల కానున్న ఇలాంటి ఓ పాన్ వరల్డ్ సినిమాలో నటించడం సంతోషంగా ఉందని, ఇందులోని పాత్రకు డబ్బింగ్ చెప్పడం కోసం తెలుగు నేర్చుకుంటున్నానని తెలిపాడు. మోహన్ బాబు పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 26న విడుదల కానుంది.