Vastu Tips: ఉత్తరం గోడకు డోర్​ పెట్టుకోవచ్చా.. ఎటు వైపు ఇంటి వాకిలి ఉండాలి..

Vastu Tips: ఉత్తరం గోడకు డోర్​ పెట్టుకోవచ్చా.. ఎటు వైపు ఇంటి వాకిలి ఉండాలి..

ఇల్లు కట్టుకొనేటప్పుడు గదులకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తామో.. మెయిన్​ డోర్​ ..  ఏ డోర్​ నుంచి బయటకు రావాలి..ఉత్తరం గోడకు గేటు పెట్టుకోవచ్చా..  ఏ వైపు వాకిలిని వాడుకోవాలి..మొదలగు వాస్తు విషయాలకు వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ గారి సలహాలను  తెలుసుకుందాం. . .

ఏ వైపు వాకిలి ఎక్కువగా వాడుకోవాలి? 
 
ప్రశ్న: ఇంటి చుట్టూ మనిషి నడిచేంత స్థలం వదిలి ఇల్లు కట్టుకున్నాం. ఆగ్నేయంలో వంటగది, దేవుడి గదులుఈశాన్యంలో.. అండర్ గ్రౌండ్ నాటర్ ట్యాంక్ కట్టుకున్నాం. తూర్పు, దక్షిణం వైపున సీసీ రోడ్లు ఉన్నాయి. తూర్పున మెయిన్ గేట్ పెట్టుకున్నాం. కానీ ఉత్తరంలో మెయిన్ గోడకు మరో గేటు పెట్టమని కొందరు సిద్ధాంతులు చెప్తున్నారు. అటు వేరే వాళ్ల గోడ ఉంది. కుదరదు. ఏం చేయాలి? ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? 

జవాబు : మీరు కట్టుకున్న వాటర్ ట్యాంకు, వంటగది వాస్తు ప్రకారం ఉన్నాయి. దేవుడి గది కూడా బాగానే ఉంది. సీసీరోడ్ల వల్ల పెద్దగా అభివృద్ధి ఉండకపోవచ్చు. అయితే, తూర్పు వైపు మెయిన్ గేటు పెట్టుకున్నారు. కాబట్టి. ఇంటి వాకిలి కూడా అటువైపే పెట్టుకోండి. ఎక్కువగా దాన్నే వాడుకోండి. దక్షిణం వైపు పూర్తిగా క్లోజ్ చేసి, కొంత స్థలాన్ని వదిలి ఫెన్సింగ్ వేయండి. ఆ స్థలంలో మొక్కలు పెంచితే మంచిది. 

ఏవైపు డోర్ పెట్టుకోవాలి

ప్రశ్న: మాది తూర్పు వాకిలి ఇల్లు. ఆగ్నేయంలో తూర్పు, దక్షిణం దిక్కుల్లో పొడుగ్గా ఓ గది ఉంది. దానిలో కొంత భాగాన్ని వంటగదిగా ఉపయోగించుకుంటున్నాం. ఈశాన్యంలో ఉన్న వరండా నుంచి ఇంట్లోకి వెళ్లడానికి వంటగది పక్కన ప్రధాన ద్వారం ఉంది. ఈ మధ్య వరండా వెనుక ఉన్న పెద్ద గదికి పడమర వైపు డోర్ పెట్టాం. ఆ డోర్ పక్కన కానీ, ఎదురుగా కానీ కిటికీలు లేవు. ఆ డోర్ పెట్టినప్పటి నుంచి ఇంట్లో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దాని వల్లే సమస్యలు వస్తున్నాయా? పరిష్కారం చెప్పండి? 

జవాబు: పడమర నైరుతిలో డోర్ ఉంటే ఇబ్బందులు వస్తాయి కానీ, పడమర వాయువ్యంలో ఉండటం తప్పు కాదు. అయితే ఇంట్లోకి గాలి, వెలుతురు ఎలా వస్తున్నాయో, చూసుకుని దానికి అనుకూలంగా కిటికీలు పెట్టుకోండి. డోర్ పెట్టడం వల్ల కాకుండా, మరేదైనా వాస్తు దోషం వల్ల సమస్యలు వస్తుండొచ్చు. ఇంటికి బాత్రూం, వంటగది వాస్తు ప్రకారం ఉన్నాయో లేదో ఒకసారి మీకు అందుబాటులో ఉన్న వాస్తు సిద్దాంతికి చూపించండి.