
ముషీరాబాద్, వెలుగు: బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయగలరా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్రామచందర్రావు సవాల్ విసిరారు. పబ్లిక్‌సర్వీస్ కమిషన్ మీద ఈ రెండు పార్టీలకు శ్రద్ధ లేదని, అందులో సభ్యులు కూడా లేరని ఆరోపించారు. మంగళవారం చిక్కడపల్లిలోని సిటీ సెంటర్ లైబ్రరీలో నిరుద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. నిరుద్యోగ యువతకు బీజేపీ అండగా ఉంటుందన్నార. ఉద్యోగాల కోసం రోడ్డు బాట పడదామని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మద్దూరి శివాజీ, శక్తి సింగ్, రాజ్ కుమార్ తో పాటు నిరుద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.