పెళ్లిలో డ్యాన్స్ చేస్తుండగా.... ఇండియన్ గ్యాంగ్ స్టర్ హతం

పెళ్లిలో  డ్యాన్స్ చేస్తుండగా.... ఇండియన్ గ్యాంగ్ స్టర్ హతం

కెనడాలో భారత సంతతికి చెందిన గ్యాంగ్ స్టర్ హతమయ్యాడు. వాంకోవర్ సిటీలో  ఓ వివాహకు హాజరైన గ్యాంగ్ స్టర్  అమర్ ప్రీత్ సామ్రపై  గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అమర్ ప్రీత్ సామ్రతో పాటు..అతని అన్న రవీందర్ కూడా ఈ వెడ్డింగ్కు హాజరయ్యారు.  ఈ ఇద్దరు గ్యాంగ్ స్టర్లు  కెనడా పోలీసుల మోస్ట్ వాయిలెంట్ లిస్టులో ఉన్నారు. 

డ్యాన్స్ చేశాడు..అంతలోనే..

గ్యాంగ్ స్టర్ అమర్‌ప్రీత్ సామ్ర ఫ్రేజర్‌వ్యూ బాంక్వెట్ హాల్‌లో పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. డ్యాన్స్ ఫ్లోర్‌లో పెళ్లికి వచ్చిన ఇతర అతిథులతో పాటు అతను కూడా డ్యాన్స్ చేశాడు. గుర్తుతెలియని వ్యక్తులు ఫ్లోర్ లోకి ప్రవేశించారు. మ్యూజిక్ ఆపమంటూ డీజే వ్యక్తిని బెదిరించారు. ఆ సమయంలో అక్కడ దాదాపు 60 మంది ఉన్నారు. అప్పుడు సమయం 1:30 గంటలు అవుతోంది. సామ్రను చూసిన దుండగులు అతనిపై కాల్పులు జరిపారు.

ముఠా కక్షల నేపథ్యంలోనే సామ్రపై  కాల్పులు జరిగినట్టుగా అమెరికా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆగష్టు 2022లో 11 మంది ముఠా సభ్యులు తీవ్ర స్థాయి హింసకు పాల్పడ్డారని..వీరి పరిసరాల్లో ప్రజలు ఉండకూడదని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల హెచ్చరికలో పేర్కొన్న 11 మందిలో అమర్‌ప్రీత్, అతని సోదరుడు రవీందర్‌తో సహా తొమ్మిది మంది పంజాబ్‌కు చెందినవారు ఉన్నారు. వీరు బ్రిటిష్ కొలంబియా పోలీసుల ప్రావిన్స్‌లో జరిగిన హత్యలు,  కాల్పులతో సంబంధం కలిగి ఉన్నారని చెప్పారు.