కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలోనే ట్రూడో!

కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. ఢిల్లీలోనే ట్రూడో!

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రయాణిస్తున్న విమానం ఢిల్లీ నుంచి బయల్దేరేందుకు ప్రయత్నిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తింది. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 సమావేశానికి విచ్చేసిన జస్టిన్‌ ట్రూడో తిరిగి కెనడాకు బయలు దేరుతుండగా.. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. విమానంలో సమస్య తలెత్తడంతో ఆయన తిరిగి ఢిల్లీలోనే ఉన్నారు.

జీ20 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన కెనడా ప్రతినిధి బృందం, గ్రౌండ్‌లోని ఇంజనీరింగ్ బృందం సమస్యను సరిదిద్దే వరకు భారతదేశంలోనే ఉంటుందని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. జస్టిన్ ట్రూడో తన కుమారుడు జేవియర్‌తో కలిసి సెప్టెంబర్ 8వ తేదీన జీ20 సమ్మిట్ సందర్భంగా ఢిల్లీకి వచ్చారు. ఆదివారం (సెప్టెంబర్ 10న) ఆయన కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.