ఏపీలో ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లు రద్దు

V6 Velugu Posted on Sep 06, 2021

  • హైకోర్టు ఆదేశాలు జారీ

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ ఆన్ లైన్ అడ్మిషన్లను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. సరైన నిబంధనలు, మార్గదర్శకాలు రూపొందించకుండా ఆన్ లైన్ అడ్మిషన్లకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసిందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయ. సెంట్రల్ ఆంధ్ర జూనియర్ కాలేజీ యాజమాన్యాల సంఘం కార్యదర్శి దేవరపల్లి రమణారెడ్డితోపాటు పలువురు విద్యార్థులు కూడా దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. సరైన నియమ నిబంధనలు, విధానాలు రూపొందించకుండా నోటిఫికేషన్ జారీ చేశారన్నవాదలనకు హైకోర్టు అంగీకరిస్తూ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు గతంలో మాదిరిగానే అడ్మిషన్లు జరపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 

Tagged VIjayawada, Amaravati, AP High Court, ap today, inter admissions, , intermediate admissions, ap updates, bejawada, high court of ap

Latest Videos

Subscribe Now

More News