వరంగల్‌‌‌‌ ల్యాండ్‍ పూలింగ్‍ రద్దు గెజిట్‍ జారీ

వరంగల్‌‌‌‌ ల్యాండ్‍ పూలింగ్‍ రద్దు గెజిట్‍ జారీ

వరంగల్‍, వెలుగు: వరంగల్‌‌‌‌లో ల్యాండ్‍ పూలింగ్‍ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాకతీయ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ (కుడా) అధికారులు జిల్లా గెజిట్‍ నంబర్‍ 10/HNK/2022 పేరుతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‍ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి కుడా వైస్‍ చైర్​ పర్సన్​ ప్రావీణ్య ఆదివారం ప్రెస్‍నోట్‍ రిలీజ్‍ చేశారు. వరంగల్‍ ఔటర్‍ రింగ్‍రోడ్‍ డెవలప్‍మెంట్‍ కోసం గతంలో ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‍ను వెనక్కి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఓఆర్‍ఆర్‍ అభివృద్ధిలో భాగంగా 41 కిలోమీటర్ల పొడవుతో వరంగల్‍, హనుమకొండ, జనగామ జిల్లాల పరిధిలోని 27 గ్రామాల్లో భూ సేకరణ పథకం కింద రైతుల నుంచి పర్మిషన్‍ కోరే నోటిఫికేషన్‍ ప్రకటనను ఓ పేపర్‍లో ఏప్రిల్‍ 30న ఫారం 01లో ఇచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిని వెంటనే క్యాన్సిల్‍ చేసుకుంటున్నట్లు చెప్పారు. తద్వారా ల్యాండ్‌‌‌‌ పూలింగ్‍ ప్రక్రియను ప్రభుత్వం రద్దు చేసినట్లు పేర్కొన్నారు.