తిరుమలలో స్వర్ణ రథోత్సవం రద్దు

 తిరుమలలో స్వర్ణ రథోత్సవం రద్దు

తిరుమల తిరుపతిలో ఇవాళ్టి నుంచి శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకలు భక్తులు లేకుండానే జరుగనున్నాయి. ఆలయంలోని కల్యాణ వేదిక దగ్గర ఈ ఉత్సావాలను నిర్వహిస్తున్నట్లు TTD అధికారులు తెలిపారు. ఇవాళ మలయప్ప స్వామి, ఉభయ దేవేరులకు స్నపన తిరుమంజనం జరుగుతుందని చెప్పారు.

వసంతోత్సవాల్లో భాగంగా రేపు(సోమవారం) జరగాల్సిన స్వర్ణ రథోత్సవాన్ని రద్దు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా తిరుమలలో స్వామివారి దర్శనాలను నిలిపివేసిన అధికారులు… ఈ నెల 14 తర్వాత పరిస్థితిని బట్టి దర్శనాల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

మరోవైపు తిరుపతిలో పేదల ఆకలిని తీర్చేందుకు రోజుకు 50 వేల ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నామని, అవసరమైతే, మరిన్ని తయారు చేసి అందిస్తామన్నారు TTD అధికారులు.