క్యాన్సర్ క్రూసేడర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ షురూ..నవంబర్ 25, 26 తేదీల్లో చాంపియన్‌షిప్ నిర్వహణ

క్యాన్సర్ క్రూసేడర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ షురూ..నవంబర్ 25, 26  తేదీల్లో చాంపియన్‌షిప్ నిర్వహణ

హైదరాబాద్, వెలుగు: క్యాన్సర్ పై అవగాహన, ఫండ్ రైజింగ్ కోసం క్యూర్ ఫౌండేషన్, అపోలో క్యాన్సర్ సెంటర్ల ఆధ్వర్యంలో ‌నవంబర్ 25, 26 తేదీల్లో నిర్వహించనున్న 8వ ద్వైవార్షిక సైబర్‌ సిటీ క్యాన్సర్ క్రూసేడర్స్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ ను టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి గోల్కొండలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్‌లో ఆదివారం ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.‌ ఈ చాంపియన్‌షిప్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా క్యూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ పి. విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ..  రెండు రోజుల పాటు ఈ చాంపియన్‌షిప్ జరగనుందన్నారు.  మూడు సెషన్లలో మూడు వందల మందికి పైగా గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటారన్నారు.  గేమ్ ఫార్మాట్ వంద శాతం హ్యాండిక్యాప్‌తో  స్టేబుల్‌ ఫోర్డ్ అన్నారు.‌  ద్వైవార్షిక క్యాన్సర్ క్రూసేడర్స్ గోల్ఫ్ చాంపియన్‌ షిప్  నిధులను సేకరించడంలో సహాయపడుతుందని తెలిపారు.