ఒమిక్రాన్‌‌ వచ్చిన కేన్సర్ పేషెంట్.. 10 రోజుల్లో కోలుకున్నడు

ఒమిక్రాన్‌‌ వచ్చిన కేన్సర్ పేషెంట్.. 10 రోజుల్లో కోలుకున్నడు

హైదరాబాద్, వెలుగు: ఒమిక్రాన్ బారిన పడిన కేన్సర్ పేషెంట్ ఒకరు 10 రోజుల్లోనే కోలుకున్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న మరో ఆరుగురూ వైరస్‌‌ను జయించినట్టు టిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికి ఒమిక్రాన్ సోకిన 67 మందిలో 22 మందిని డిశ్చార్జ్ చేశారు. వీరిలో ఎవరికీ స్టెరాయిడ్స్, ఆక్సిజన్, రెమ్‌‌డెసివిర్ వంటి ఇంజక్షన్లు వాడలేదని చెప్పారు. అందరూ కొద్దిపాటి లక్షణాలతో హాస్పిటల్‌‌కు వచ్చారని, ఆ లక్షణాలకు సంబంధించి మెడిసిన్, విటమిన్ ట్యాబ్లెట్లు మాత్రమే ఇచ్చామని వెల్లడించారు. కాగా, ఒమిక్రాన్‌‌ సోకినవాళ్లలో 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండట్లేవని డాక్టర్లు చెబుతున్నారు. 10 శాతం మందిలో దగ్గు, జలుబు సింప్టమ్స్ ఉంటున్నాయంటున్నారు. 

311  కేసులు.. ఇద్దరు మృతి
రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 311 కరోనా కేసుల నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్‌‌లో 198, జిల్లాల్లో 113 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 4 నెలల తర్వాత కేసుల సంఖ్య 300 దాటడం ఇదే తొలిసారి అని హెల్త్ డిపార్ట్​మెంట్ చెప్పింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 6,81,898కి చేరగా, ఇందులో 6,74,221 మంది కోలుకున్నారని, 3,650 యాక్టివ్‌‌ కేసులున్నాయని తెలిపింది. కరోనాతో శుక్రవారం ఇద్దరు చనిపోగా.. మృతుల సంఖ్య 4,027కి పెరిగిందని బులెటిన్‌‌లో పేర్కొంది. శుక్రవారం ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదు కాలేదని వెల్లడించింది.