- టీజీఎస్పీఏసీ, గాంధీ భవన్ ముట్టడికి గ్రూప్ 4 అభ్యర్థుల యత్నం
బషీర్ బాగ్, వెలుగు : గ్రూపు-–4 ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, గాంధీ భవన్ ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. పరీక్ష రాసి 460 రోజులు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగి 45 రోజులు అయ్యాయన్నారు. 11 వేల డీఎస్సీ పోస్టులను 57 రోజుల్లో పూర్తి చేసిన అధికారులకు గ్రూపు- 4కు ఎందుకింత టైం పడుతుందని ప్రశ్నించారు.
మొత్తం 8,180 ఉద్యోగాలకు వెంటనే 1:1 ప్రకారం ఫైనల్ లిస్ట్‌ను విడుదల చేయాలని కోరారు. వేగంగా ప్రక్రియ పూర్తి చేసి దసరాకు తుది ఫలితాలు ఇస్తే, ఈ ప్రభుత్వాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామన్నారు.