జూన్ 2న క్యాండిల్ ర్యాలీకి అనుమతివ్వాలి

జూన్ 2న క్యాండిల్ ర్యాలీకి అనుమతివ్వాలి
  •      బల్దియా కమిషనర్​ను కోరిన బీఆర్ఎస్ ​నేతలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న గన్ పార్క్ నుంచి ట్యాంక్ బండ్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు పర్మిషన్​ఇవ్వాలని బీఆర్ఎస్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చైర్మన్ గెల్లు శ్రీనివాస్, రాష్ట్ర విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు తుంగ బాలు కోరారు. మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ అందుబాటులో లేకపోవడంతో, కమిషనర్ ఓఎస్డీ వేణుగోపాల్​ను కలిసి అప్లికేషన్​అందజేశారు.

 ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ర్యాలీకి అనుమతి ఇవ్వాలని అప్లికేషన్​సమర్పించినట్లు వారు వివరించారు. జూన్​2న సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 9 వరకు ర్యాలీ జరుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ర్యాలీలో దాదాపుగా 500 మంది పాల్గొంటారని చెప్పారు..