వంటింటి పొగ, కొవ్వొత్తుల పొగతో ఆస్తమా వస్తుందా..?

వంటింటి పొగ, కొవ్వొత్తుల పొగతో ఆస్తమా వస్తుందా..?

కొద్దిగా వాతావరణం చల్లబడిందంటే చాలు.. క్యాండిల్ వెలిగించుకోవడమో.. గ్యాస్  పొయ్యి వెలిగించుకొని వేడి కాచుకోవడమో.. అదే కాస్త గ్రామీణ ప్రాంతమైతే నాలుగు కర్రముక్కలు పోగు చేసి మంట పెట్టి వేడి వాతావరణంలో ఉడటమో చేస్తారు.  అయితే వాటినుంచి వెలువడే పొగ ఎంత ప్రమాదకరమో ఒక్కసారైనా ఊహించారా.. ..దాని వల్లే అస్తమా వస్తుందని  డెన్మార్క్‌లోని ఆర్హస్ యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధ్యయనం చేసింది. 

ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకూ ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో ఆస్తమా (ఉబ్బసం) వ్యాధి ఒకటి. ఇది శ్వాస సంబంధ వ్యాధి ఇది. దీనివల్ల ఊపిరితిత్తుల్లో వాపు వల్ల వాయు మార్గాలు కుంచించుకు పోతాయి. శ్వాసకు అడ్డంకులు ఏర్పడి రోగి సరిగ్గా గాలి తీసుకోలేక ఇబ్బందిపడతాడు. ఈ వ్యాధిగ్రస్తులను ఆయాసం, దగ్గు బాగా ఇబ్బంది పెడతాయి. వర్షాకాలం, శీతాకాలంలో అస్తమా రోగులకు సమస్యలు మరింతగా పెరుగుతాయి. ఈ రెండు కాలాల్లో సూర్యరశ్మి తక్కువగా ఉండటంతో విటమిన్‌-డి తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి మరింత పడిపోయి ఆస్తమా తీవ్రరూపం దాల్చుతుంది. ఉబ్బసం వ్యాధి ఎలా వస్తుందో డెన్మార్క్‌లోని ఆర్హస్ యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధ్యయనం చేసింది. 

వంటచెరకు నుంచి వచ్చేపొగ, కొవ్వొత్తుల నుంచి వచ్చే పొగ వలన అస్తమాతో బాధపడుతుతున్న వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని డెన్మార్క్‌లోని ఆర్హస్ యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ వారు చేసిన పరిశోధనలో రుజువైందని శాస్త్రవేత్తలు తెలిపారు.  ఈ పొగ వలన కొన్ని రోగ కణాలు, విష వాయులు గాలిలో కలుస్తాయన్నారు.  అవి మనకు తెలియకుండానే మన శరీరంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. 

కొద్దిపాటి లక్షణాలతో ఉబ్బసంతో బాధపడే 36 మందిపై  పరిశోధనలు చేశారు.  వీరికి ఇష్టమైన  వంటకం వండుతూ.. క్యాండిల్ పొగ ఉన్న ప్రదేశంలో ఉంచారు.   డెన్మార్క్‌లోని ఆర్హస్ యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ అధ్యయనం ప్రకారం వీరిలో ఉబ్బసం లక్షణాలు పెరిగాయని గుర్తించారు.  పొగ ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్నిచూపుతుందని పరిశోధకుల్లో ఒకరైన కరిన్ రోసెన్‌కిల్డే లార్సెన్ తెలిపారు.   వీరి డీఎన్ఏను పరిశీలించి.. ఊపిరితిత్తుల ప్రాంతంలో వాపు వచ్చినట్లు పరిశోధన బృందం గుర్తించింది.  కొవ్వొత్తులు వెలిగించినప్పుడు వాటి నుంచి వెలువడే పొగ శరీరంలోని వెళ్లడం వలన ఇలా జరిగిందని నివేదికలో వివరించారు.  ఈ వాయువులు ఆరోగ్యానికి హాని కలుగజేస్తాయని తెలిపారు.  

18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సుగల  36 మందిపై  ఆర్హస్ యూనివర్శిటీలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ పరిశీలన చేసింది.  వీరిని  ఆర్హస్ విశ్వవిద్యాలయంలోని నియంత్రిత వాతావరణ గదులలో ఉంచారు. స్వచ్చమైన గాలి, వెంటిలేషన్ వంటి సౌకర్యాలను ఒక రోజులో అనగా 24 గంటల్లో 5 గంటలు మాత్రమే అందించి పరిశీలన చేశారు. సరైన వెంటిలేషన్ లేకుండా వంట చేసేటప్పుడు వచ్చే పొగ, కొవ్వొత్తుల పొగ వాయువును వారు తీసుకోవడం వల్ల  అస్తమా (ఉబ్బసం) లాంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయని పరిశోధకురాలు లారెన్స్ తెలిపారు.  సాధారణ వ్యక్తుల ఆరోగ్యంతో  పోలిస్తే వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. 

శీతాకాలం సమీపిస్తుండటంలో  చాలా మంది చలి మంటలు వేసుకుంటారు.  అయితే వాటి నుంచి వెలువడే పొగ పీలిస్తే చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.  వీటివలన ఊపిరితిత్తుల సమస్య, గుండె సమస్య, క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని లారెన్స్ తెలిసారు.  ఎయిర్ క్వాలిటీ విషయంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు.