కెనాన్ తన లేటెస్ట్కెమెరా మోడల్ పవర్ షాట్ వీ10ను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. వీడియో రికార్డింగ్ కోసం ఈ కాంపాక్ట్ కెమెరాను డిజైన్ చేశామని కంపెనీ తెలిపింది. దీనిలో ఇన్–బిల్ట్ మైక్రోఫోన్ కూడా ఉంది. ఏఎస్ఎంఆర్ వీడియోలను తీయడానికి ఉపయోగపడే శబ్దాన్ని తగ్గించి, క్లీన్ సౌండ్‌ను రికార్డ్ చేస్తుంది.
దీనిని మొబైల్స్‌కూ కనెక్ట్ చేయొచ్చని కెనాన్ తెలిపింది. ధర రూ. 39,995 కాగా, అమ్మకాలు వచ్చే నెల నుంచి మొదలవుతాయి. కెనాన్ పవర్షాట్వీ10లో డిజిక్ఎక్స్ ఇమేజ్ ప్రాసెసర్, ఇంచు మందం ఉండే సీఎంఓఎస్13.1–మెగాపిక్సెల్ సెన్సార్‌ను అమర్చారు. ఫేస్ ట్రాకింగ్ ఫీచర్, ఫ్రేమ్ ఆటో-ఫోకస్, 19 ఎంఎం లెన్స్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం.
