కరోనాతో భయపడాల్సిన పని లేదు: కేజ్రీవాల్

కరోనాతో భయపడాల్సిన పని లేదు: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: కరోనాతో భయపడాల్సిన పని లేదని, వైరస్ కంటే తమ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు అడుగులు ముందుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కరోనాతో జాగ్రత్తగా ఉండాలి కానీ భయపడకూడదని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తాను ప్రజలకు హామీ ఇస్తున్నానని, కరోనా కంటే తమ ప్రభుత్వం ఫోర్ స్టెప్స్ ముందుందని శనివారం కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశంలో లాక్ డౌన్ శాశ్వతంగా ఉండదని కేజ్రీ అన్నారు.

‘ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. దీన్ని మేం ఒప్పుకుంటాం. కానీ దీని గురించి చింతిచాల్సిన అవసరం లేదు. మేం పూర్తి సన్నద్ధతో ఉన్నాం. మనం పర్మనెంట్ గా లాక్ డౌన్ లోనే ఉండిపోం. చాలా మంది కరోనా బాధితులు కోలుకుంటున్నారు. వాళ్లు తిరిగి తమ ఇళ్లకు వెళ్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని కేజ్రీవాల్ వివరించారు. దేశ రాజధానిలో గురువారం ఒక్క రోజే 1,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా, ఢిల్లీలోని ఐదు హోటళ్లను కరోనా ఆస్పత్రులుగా మారుస్తూ ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకంది. కరోనాను ఎదుర్కొనేందుకు తాము ఫుల్లీ ప్రిపేర్డ్ గా ఉన్నట్లు ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్ తెలిపారు.