రాసిపెట్టి ఉంటే ఇలాగే : ఆరు సార్లు పాము కటేసినా.. ఆమె బతికింది..

రాసిపెట్టి ఉంటే ఇలాగే : ఆరు సార్లు పాము కటేసినా.. ఆమె బతికింది..

మధ్యప్రదేశ్‌లోని కట్నీలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక మహిళ 6 సార్లు పాము కాటుకు గురైంది. షాకింగ్ విషయం ఏమిటంటే, ప్రతిసారీ మహిళ మృత్యువుతో పోరాడి గెలిచింది. తాజాగా మే 10 వ తేదీన కూడా పాము కాటుకు ఆ మహిళ గురయ్యింది. దీంతో ఆమెని వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. ఈ మహిళ పేరు పూజా వ్యాస్.. వరుసగా పాము కాట్లకు గురి అవుతుండటంతో పూజా కుటుంబం కూడా షాక్ అవుతోంది. పాము పూజాపై పగ పట్టిందని స్థానికులు భావిస్తున్నారు.

పాములు పగపడతాయా? ఏళ్లకు ఏళ్లయినా వదలకుండా వెంటాడుతాయా? అంటే అవునని అంటున్నారు ఆ రాష్ట్రంలోని గ్రామవాసులు. పూర్తి వివరాలను చూస్తే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్ని జిల్లా బహరోబంద్ పరిధిలోని గుణబచ్చయ్య గ్రామంలో ఓ కుటుంబంలోని మహిళపై పాము పగబట్టిందట. మే 10వ తారీఖును ఆమె ఇంట్లో పని చేసుకుంటుండగా త్రాచుపాము కాటు వేసింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆమెను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఐతే సదరు మహిళను పాము కాటు వేయడం ఇదే మొదటిసారి కాదని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.

పూజా వ్యాస్ కట్ని జిల్లా బహోరీబంద్ తహసీల్‌లోని గుణ బచ్చయ్య గ్రామంలో ఉంటోంది. ఈమెను గత ఆరు ఏళ్లలో 6 సార్లు పాము కాటుకు గురయ్యింది. అయితే పూజను ఒకే పాము ఆరు సార్లు కాటేసిందా లేక.. వేర్వేరు పాము కాటేసిందా అన్నది తెలియరాలేదు. మే 10న ఇంట్లో పని చేస్తున్న సమయంలో.. ఆమెను ఓ విష సర్పం కాటేసింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పగా.. బహోరీబంద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. సకాలంలో చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలతో బయట పడింది. తాజాగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

వరుసగా పూజానే పాము కాటుకు గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆ యువతిపై పాము పగ పట్టిందని భావిస్తున్నారు. ఒకే పాము పదే పదే పూజాపై దాడి చేస్తుందని అనుమానిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే పాము ఇప్పటి వరకు ఆమెను6 సార్లు కాటేసింది.. అయితే కాటుకు గురైన ఆరుసార్లు అది ఇంటి ప్రాంగణంలోనే జరిగిందని పూజా వ్యాస్ తెలిపింది. కానీ పాము ఎప్పుడూ తన ఇంట్లోకి రాలేదని పేర్కొంది. పూజాకు భర్త ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కానీ వారికి ఎన్నడూ ఆ పాము హాని కలిగించలేదు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.