ఏసీపీ ఇంట్లో సోదాలు.. భారీగా నోట్ల కట్టలు,20కి పైగా ఆస్తిపత్రాలు సీజ్

ఏసీపీ ఇంట్లో సోదాలు.. భారీగా నోట్ల కట్టలు,20కి పైగా ఆస్తిపత్రాలు సీజ్

సీసీఎస్ ఏసీపీ  ఉమామహేశ్వరరావు ఇంట్లో ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఉమా మహేశ్వరరావు ఇంట్లో  60 లక్షల నగదు తోపాటు భారీగా బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 20కి పైగా ఆస్తుల పత్రాలు సీజ్ చేశారు. బినామీ పేర్లతో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉమామహేశ్వరరావు, సందీప్ కలిసి పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. 

ఈ సందీప్ ఎవరనేదానిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  CCSలో ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కేసుల వివరాలపై ఆరా తీస్తున్నారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో బాధితుల దగ్గర నుంచి ఉమామహేశ్వరరావు డబ్బులు డిమాండ్ చేసినట్లు అనుమానిస్తున్నారు ఏసీబీ అధికారులు. అయితే ఉమామహేశ్వరరావు విచారణకు అస్సలు సహకరించడం లేదని ఏసీబీ అధికారులు వెల్లడించారు