కంటోన్మెంట్ సమస్యలపై అసెంబ్లీలో గళం..ఎమ్మెల్యే శ్రీగణేశ్ విజ్ఞప్తికి మంత్రి శ్రీధర్ బాబు స్పందన

కంటోన్మెంట్ సమస్యలపై అసెంబ్లీలో గళం..ఎమ్మెల్యే శ్రీగణేశ్ విజ్ఞప్తికి మంత్రి శ్రీధర్ బాబు స్పందన

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో అసంపూర్తిగా నిలిచిపోయిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను తక్షణమే పూర్తి చేయాలని, కొత్త వాటిని మంజూరు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీగణేశ్ బుధవారం కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిధులు లేక పనులు మధ్యలోనే ఆగిపోయాయని, ముఖ్యంగా తిరుమలగిరిలోని గాంధీ కమ్యూనిటీ హాల్ ప్రస్తుతం డంపింగ్ యార్డ్​గా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ ఫంక్షన్ హాళ్ల ఖర్చులను భరించలేక బస్తీల్లో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు.. కంటోన్మెంట్ బోర్డు అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని, ఎమ్మెల్యే నుంచి ప్రతిపాదనలు తీసుకుని అసంపూర్తి పనులను పూర్తి చేస్తామని సభలో హామీ ఇచ్చారు.-