FIFA World Cup: కొనసాగుతున్న కేప్ వెర్డే సంచలనాల పర్వం.. ఉరుగ్వేకు షాక్

FIFA World Cup:  కొనసాగుతున్న కేప్ వెర్డే సంచలనాల పర్వం.. ఉరుగ్వేకు షాక్

మయామి గార్డెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఈ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెర్డే సంచలనాల పర్వం కొనసాగుతోంది. గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండుసార్లు చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉరుగ్వేతో మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 2–2తో డ్రా చేసుకుంది. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21వ నిమిషంలో కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెర్డే ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెవిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పినా ఫ్రీ కిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా సాధించిన గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆ దేశ ఫుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది.

వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెర్డేకు ఇది తొలి గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. హిలియో వరెలా (61వ ని) మరో గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించాడు. ఉరుగ్వే ప్లేయర్లు మ్యాక్సీ అరౌజో (44వ ని), అగస్టిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కానోబియో (45+6వ ని) గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాధించారు. సెకండాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా దిగిన వరెలా.. ఉరుగ్వే డిఫెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన తప్పుడు పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆసరాగా చేసుకుని బంతిని గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి పంపాడు.

ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతనికి ఇది తొలి గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుకు వేదికైంది. మైదానంలో ఇరుజట్ల తరఫున ఆడిన గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీపర్లు ఇద్దరూ 40 ఏళ్లు పైబడినవారే కావడం విశేషం.