మోస్ట్ వాంటెడ్ కెప్టెన్ మిల్లర్.. టీజర్ రెస్పాన్స్ అదుర్స్

మోస్ట్ వాంటెడ్ కెప్టెన్ మిల్లర్.. టీజర్ రెస్పాన్స్ అదుర్స్

ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుటారు తమిళ స్టార్ హీరో ధనుష్(Danush). ఇప్పుడు మరోసారి మరో కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ మూవీనే కెప్టెన్ మిల్లర్(Captain Miller). అరుణ్ మాతేశ్వరన్(Arun Matheswaran) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep kishan) ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే జులై 28 ధనుష్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులకు ట్రీట్ ఇస్తూ ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ మొత్తం యాక్షన్ సీక్వెన్సెస్ తో నింపేశారు దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్. బ్రిటిషర్లకు, కెప్టెన్ మిల్లర్ కి మధ్య జరిగే యుద్ధం కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్ కు జీవీ(GV Prakash) ప్రకాష్ అందించిన మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉంది. ఇక మొత్తంగా ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమా డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

AsloRead:    బార్డర్ దాటిన మరో లవ్ స్టోరీ.. స్నాప్‌చాట్‌లో పరిచయం.. పాక్ కు వెళ్లిన చైనా మహిళ