
గండిపేట, వెలుగు: ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంగారెడ్డికి చెందిన విజయ్‌కుమార్ (27) సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. బుధవారం మరో అమ్మాయితో కలిసి కారులో బయలుదేరాడు. నార్సింగి పీఎస్ పరిధిలోని కోకాపేట మూవీ టవర్స్ వద్ద అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు.
ఈ ప్రమాదంలో కారులోని ఇద్దరు తీవ్రంగా గాయపడగా, సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.