బావిలో పడ్డ కారు: తల్లీకొడుకు, గజ ఈతగాడు మృతి

బావిలో పడ్డ కారు: తల్లీకొడుకు, గజ ఈతగాడు మృతి

సిద్ధిపేట జిల్లా: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ దగ్గర బావిలో పడిన కారు ఘటనలో ముగ్గురు చనిపోయారు. కారులో ఉన్న ఇద్దరితో పాటు వారిని కాపాడేందుకు వెళ్లిన గజ ఈతగాడు కూడా చనిపోయాడు. కారును బయటకు తీసే ప్రయత్నంలో గజఈతగాడు నర్సింహులు చనిపోయాడు. కారులో చనిపోయిన వారిని నిజాంపేట మండలం నందిగామకి చెందిన తల్లికొడుకులు బాగ్యలక్ష్మి, ప్రశాంత్ గా గుర్తించారు. గజ ఈతగాడు నర్సింహులది ఎనగుర్తి గ్రామం.  ఆరు గంటలు శ్రమించి కారును బయటకి తీశారు. బావిలోతు సుమారు 15 నుంచి 20 గజాలుంటుందని స్థానికులు చెబుతున్నారు.