మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో గాంధీ హాస్పటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం చనిపోయాడు. మృతుడు అన్నోజిగూడకు చెందిన గిరిగా గుర్తించారు పోలీసులు.
యాక్సిడెంట్ కు సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ ప్రమాదం జూలై 14న సాయంత్రం జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది