కరీంనగర్ జిల్లాలో బస్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఎదురు చూస్తున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

కరీంనగర్ జిల్లాలో బస్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఎదురు చూస్తున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

ఎల్లారెడ్డిపేట, వెలుగు: బస్సు కోసం బస్టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎదురుచూస్తున్న ఇద్దరు మహిళలను ఓ కారు వచ్చి ఢీకొట్టడంతో స్పాట్ లో ఓ మహిళ చనిపోయింది. పోలీసులు వివరాల ప్రకారం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు గ్రామానికి చెందిన చిల్ల లక్ష్మి(38), బోయిని రజిత, ఆమె కొడుకు యశ్వంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి బుధవారం ఊరికి వెళ్లేందుకు బస్టాప్ వద్ద నిల్చున్నారు. కామారెడ్డి వైపు నుంచి ఆర్టీసీ బస్సు వచ్చి ఆగుతుండగా దాని వెనుక నుంచి కారు లెఫ్ట్ సైడ్ నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చి ఢీకొట్టింది. 

ఈ ఘటనలో వారు ఎగిరిపడి తీవ్రంగా గాయపడ్డారు. చిల్ల లక్ష్మి స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే చనిపోయింది. రజితతో పాటు చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ హస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు బిడ్డలు, కొడుకు ఉన్నారు. కాగా కారు మహారాష్ట్రకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ హుస్మాన్ ను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.