కార్లకు బ్రేక్..భారీగా తగ్గిన సేల్స్

కార్లకు బ్రేక్..భారీగా తగ్గిన సేల్స్

న్యూఢిల్లీ : ప్యాసింజర్‌ వెహికల్స్(పీవీ) అమ్మకాలు వరుసగా క్షీణిస్తూనే ఉన్నాయి. వరుసగా మూడో నెల దేశీయ ప్యాసెంజర్ వాహనాలు 1.87 శాతం తగ్గినట్టు సియామ్ వెల్లడించింది. పండుగ సీజన్‌ లో అమ్మకాలు అంతగా లేకపోవడంతో, డీలర్ల వద్దనున్న ఇన్వెంటరీ స్థా యిలను తయారీదారులు తగ్గిస్తున్నారని సియామ్ తెలిపింది. సొసైటీ ఆఫ్ ఇండి యన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) విడుదల చేసిన డేటా ప్రకారం.. పీవీ అమ్మకాలు జనవరి నెలలో 2,80,125 యూనిట్లుగా నమోదయ్యాయి. 2018 జనవరిలో ఇవి 2,85,467 యూనిట్లుగా ఉన్నాయి. పీవీ సేల్స్‌‌తో పాటు దేశీయ కారు అమ్మకాలు కూడా వరుసగా మూడో నెల 2.65 శాతం క్షీణించాయి.

2018 జనవరిలో 1,84,264 యూనిట్లుగా ఉన్న కారు అమ్మకాలు, ఈ ఏడాది జనవరిలో 1,79,389 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్ డేటాలో వెల్లడైంది. ఇన్వెంటరీకి కోత పెడుతూ.. తయారీదారులు స్టాక్ కరెక్షన్ చేపడుతున్నట్టు సియామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుగతో సేన్ చెప్పారు. జనవరి నెలలో హోల్‌ ‌సేల్ సేల్స్ కంటే రిటైల్ సేల్స్ మెరుగ్గా ఉన్నట్టు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలి ఉన్న రెండు నెలల్లో డిమాండ్ పెరుగుతుందని ఇండస్ట్రీ అంచనావేస్తున్నట్టు తెలిపారు.

మారుతీ సేల్స్: మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ జనవరిలో ప్యాసెంజర్ వాహనాల అమ్మకాల్లో 0.18 శాతం వృద్ధిని నమోదు చేసి,1,39,440 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ప్యాసెంజర్ కారు సెగ్మెంట్‌‌లో అమ్మకాలు 4.12 శాతం తగ్గి, 1,01,865 యూనిట్లుగా ఉన్నాయి.


హ్యుందాయ్ మోటార్స్: జనవరి నెలలో మారుతీ ప్రత్యర్థి కంపెనీ అయిన హ్యుం దాయ్ మోటార్ ఇండి యా లిమిటెడ్ 0.65 శాతం వృద్ధితో 45,803 యూనిట్లను అమ్మింది. కారు సేల్స్ విషయానికొస్తే, 1.58 శాతం తగ్గి, 35,439 యూనిట్లుగా ఉన్నాయి.

మహింద్రా అండ్ మహింద్రా:
దేశీయ యుటిలిటీ వెహికిల్ దిగ్గజమైన ఎం అండ్ ఎం కూడా పీవీ అమ్మకాల్లో 0.88 శాతం వృద్ధినే నమోదు చేసింది. గత నెలలో 23,864 యూనిట్ల పీవీలను విక్రయించింది.

హోండా కార్స్ ఇండియా: దీని కారు అమ్మకాలు  ఆశ్చర్యకరంగా 51.67 శాతం పెరిగి 14,383 యూనిట్లుగా ఉన్నాయి.