టపాసులు కాల్చేటపుడు జాగ్రత్త.. ఫిర్జాదీగూడలో కారుకింద పేలిన టపాసులు..కారు దగ్ధం

టపాసులు కాల్చేటపుడు జాగ్రత్త.. ఫిర్జాదీగూడలో కారుకింద పేలిన టపాసులు..కారు దగ్ధం

దీపావళి వచ్చిందంటే టపాసులతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాటితో ప్రమాదం పొంచి ఉంటుంది. ఒక్కోసారి ఆస్తి నష్టం జరగడమే గాకుండా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. టపాసులు ఎక్కడపడితే అక్కడ కాల్చితే ప్రమాదాలు జరుగుతున్నాయి . హైదరాబాద్ లోని ఫిర్జాదీ గూడలో టపాసులు కారు కిందికి పోవడంతో కారు దగ్ధం అయ్యింది. 

అక్టోబర్ 20న అర్థరాత్రి మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడలో  మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పి.అండ్.టి కాలనీ రోడ్ నంబర్ 2లో దీపావళి టపాసులు కాలుస్తుండగా  ఇంటి ముందు పార్కు చేసిన కారులో ఒక్కసారి మంటలు చెలరేగాయి.  టపాసులు కారు కిందికి వెళ్లి పేలడంతో కారుకు నిప్పంటుకొని మంటలు చెలరేగాయి. స్థానికుల వెంటనే ఫైర్ సిబ్బందికి  సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది కాలుతున్న కారు మంటలను అదుపు చేశారు. అప్పటికే  కారు వెనుక భాగం పూర్తిగా దగ్ధమైంది, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కాలనీవాసులు ఊపిరి పిలుచుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.