ఫ్లైఓవర్​పై కారు బోల్తా..స్టీరింగ్ లాక్ కావడంతో ప్రమాదం

ఫ్లైఓవర్​పై కారు బోల్తా..స్టీరింగ్ లాక్ కావడంతో ప్రమాదం

మెహిదీపట్నం, వెలుగు: రన్నింగ్​లో ఉన్న కారు స్టీరింగ్ ప్రమాదవశాత్తు లాక్ కావడంతో డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. బండ్లగూడ సన్ సిటీకి చెందిన అద్నాన్ అహ్మద్ శుక్రవారం తన కారులో లంగర్ హౌస్ ఫ్లైఓవర్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. కారు స్టీరింగ్ ఒక్కసారిగా లాక్ కావడంతో డివైడర్ ను ఢీకొని బోల్తా పడింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో అద్నాన్ అహ్మద్ కు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ప్రమాదంతో ప్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  దీంతో లంగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని తొలగించి, ట్రాఫిక్​ను  క్లియర్ చేశారు. స్వల్పంగా గాయపడిన బాధితుడిని హాస్పిటల్​కు తరలించారు.