95 మంది పిల్లలకు గుండె పరీక్షలు

95 మంది పిల్లలకు గుండె పరీక్షలు

రంగారెడ్డి, వెలుగు: ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు గుర్తించిన పేద చిన్నారులకు రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం గుండె పరీక్షలు నిర్వహించారు. అపోలో హాస్పిటల్​ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరాన్ని కుటుంబ, ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు. 95 మంది పేద చిన్నారులకు గుండె పరీక్షలు చేయగా, అందులో 45 మందికి హార్ట్ ఆపరేషన్ అవసరమని గుర్తించారు.  మరో 53 మంది చిన్నారులకు కావాల్సిన మెడిసిన్స్ అందజేశారు. 

అపోలోకు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ అమల్ గుప్తా చిన్నారులకు 2డీ ఈకో, గుండె స్క్రీనింగ్స్ చేసి పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ అవసరమైన చిన్నారులకు జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్​లో ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ డా.జి సుదీరా, డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ అనురాగిని పాల్గొన్నారు.