వరంగల్ జిల్లా అజర హాస్పిటల్​లో కార్డియో పల్మనరీ రిహబ్​’ శిక్షణ

వరంగల్ జిల్లా అజర హాస్పిటల్​లో కార్డియో పల్మనరీ రిహబ్​’ శిక్షణ

కాశీబుగ్గ, వెలుగు : కార్డియో పల్మనరీ, వెస్టిబ్యులర్​ రిహబ్(పునరావస) విధానాలపై సోమవారం వరంగల్ సిటీలోని అజర హాస్పిటల్​లో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్​(సీఎంఈ) శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ (పల్మనాటలజిస్ట్​), డాక్టర్ ​బీఆర్.సురేశ్, కార్డియాలజిస్ట్ డాక్టర్ షఫీ, అజర హాస్పిటల్ లీడ్​-పిజియోథెరపిస్ట్ డాక్టర్ మమత మాట్లాడుతూ  పల్మనరీ రిహబ్ (పునరావాస) వైద్య విధానాలను వివరించారు.

మూత్రపిండాలు, గుండె వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలున్న రోగులకు రిహాబిలిటేషన్ ఎలా అందించాలో వివరించారు. అనంతరం డాక్టర్ షఫీ మాట్లాడుతూ రిహబ్ విధానాల ప్రాధాన్యత, అవసరాన్ని వివరించారు. ఆయా పద్ధతులు, మార్గదర్శకాలు, ప్రాముఖ్యత గలవని తెలిపారు. డాక్టర్ మమత మాట్లాడుతూ రోగులకు వెస్టిబ్యులర్ పునరావాస విధానాలు ఎలా ఉపయోగపడతాయో ఆచరణాత్మకంగా వివరించారు.

ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్​ బి.శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అజర ఆస్పత్రి ఎల్లప్పుడూ రోగులకు ఉత్తమ వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటుంది, ఇలాంటి సీఎంఈ కార్యక్రమాలు వైద్యులకు నూతన సాంకేతికతను పరిచయం చేస్తాయని తెలిపారు. అజర హాస్పిటల్​లో పునరావాస, ఫిజియోథెరఫీ సేవలు పొందడానికి ఆసక్తి ఉన్నవారు 93910 09739 ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.