అనురాగ్లో జడ్పీ స్టూడెంట్స్కు కెరీర్ క్లాసెస్

అనురాగ్లో జడ్పీ స్టూడెంట్స్కు కెరీర్ క్లాసెస్

ఘట్​కేసర్, వెలుగు: ఘట్​కేసర్​సర్కిల్ వెంకటాపూర్ పరిధిలోని అనురాగ్ వర్సిటీలో ప్రతాప్ సింగారం జడ్పీ హైస్కూల్​విద్యార్థులకు ఎన్ఎస్ఎస్ సెల్, స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కెరీర్ తరగతులు నిర్వహించారు. ఇందులో అనురాగ్ వర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్, ప్రముఖ కెరీర్ కోచ్, ఎడ్యుకేటర్ డాక్టర్ సి.మల్లేశ్ పాల్గొని మాట్లాడారు. 

చదువు ముఖ్యమే అని, లక్ష్యం నిర్ధేశించుకుని సాధించేవరకూ పట్టుదల వీడొద్దన్నారు. అలాగే, తప్పనిసరిగా 7గంటలు నిద్రపోవాలని, జంక్​ ఫుడ్​కు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమం స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ళ యాదయ్య, కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రావు, టీచర్లు సాగర్ రెడ్డి,  సత్యనారాయణ, శ్రీవిద్య పాల్గొన్నారు.