ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ రాజు అల్కరాజ్‌‌‌‌‌‌‌‌

ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ రాజు అల్కరాజ్‌‌‌‌‌‌‌‌
  •      మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ సొంతం
  •     ఫైనల్లో జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌కు చెక్‌‌‌‌‌‌‌‌

పారిస్‌ ‌‌‌‌‌‌‌: స్పెయిన్‌‌‌‌‌‌‌‌ స్టార్‌‌‌‌‌‌‌‌ కార్లోస్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌.. ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ను గెలుచుకున్నాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో మూడోసీడ్‌‌‌‌‌‌‌‌ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ 6–3, 2–6, 5–7, 6–1, 6–2తో నాలుగోసీడ్‌‌‌‌‌‌‌‌ అలెగ్జాండర్‌‌‌‌‌‌‌‌ జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ (జర్మనీ)పై నెగ్గాడు. దీంతో మూడు రకాల కోర్టుల్లో (క్లే, గ్రాస్‌‌‌‌‌‌‌‌, హార్డ్‌‌‌‌‌‌‌‌) టైటిల్స్‌‌‌‌‌‌‌‌ గెలిచిన తొలి యంగెస్ట్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా (21 ఏళ్లు) అతను చరిత్ర సృష్టించాడు. అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది తొలి ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ కాగా, 2022లో యూఎస్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌, 2023లో వింబుల్డన్‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. 

ఇక గ్రాండ్‌‌‌‌‌‌‌‌స్లామ్స్‌‌‌‌‌‌‌‌లో ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరిన ప్రతిసారి టైటిల్‌‌‌‌‌‌‌‌ నెగ్గిన రికార్డును కూడా అతను సొంతం చేసుకున్నాడు. 4 గంటలా 19 నిమిషాల మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో స్పెయిన్‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ పోరాట స్ఫూర్తి చూపెట్టాడు. తన కంటే సీనియర్‌‌‌‌‌‌‌‌ అయిన జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ కొట్టిన ప్రతి షాట్‌‌‌‌‌‌‌‌కు బదులిచ్చాడు. తొలి సెట్‌‌‌‌‌‌‌‌లో 2–2తో స్కోరు సమం చేసిన అల్కరాజ్ మూడుసార్లు జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ సర్వీస్‌‌‌‌‌‌‌‌ బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసిన ఈజీగా సెట్‌‌‌‌‌‌‌‌ గెలిచాడు. 

కానీ తర్వాతి రెండు సెట్లలో జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. బలమైన సర్వీస్‌‌‌‌‌‌‌‌లు, క్రాస్‌‌‌‌‌‌‌‌ కోర్టు విన్నర్లతో రెచ్చిపోయిన అతను అల్కరాజ్‌‌‌‌‌‌‌‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. అయితే నాలుగో సెట్‌‌‌‌‌‌‌‌లో బేస్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ ఆడిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను కోర్టు నలువైపులా కొట్టాడు. దీంతో బాగా అలసిపోయిన జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ ఒక్కసారి మాత్రమే సర్వీస్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకున్నాడు.

 నిర్ణయాత్మక ఐదో సెట్‌‌‌‌‌‌‌‌లోనూ అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ ఆధిపత్యమే ఎక్కువగా నడించింది. రెండుసార్లు జ్వెరెవ్‌‌‌‌‌‌‌‌ సర్వ్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేసి చిరస్మరణీయ విజయంతో టైటిల్‌‌‌‌‌‌‌‌ను సాధించాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ మొత్తంలో మూడు ఏస్‌‌‌‌‌‌‌‌లే కొట్టిన అల్కరాజ్‌‌‌‌‌‌‌‌ ఆరు డబుల్‌‌‌‌‌‌‌‌ ఫాల్ట్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 16 బ్రేక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో తొమ్మిదింటిని కాచుకున్నాడు. మరోవైపు విమెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ను కోకో గాఫ్‌‌‌‌‌‌‌‌ (అమెరికా)–కెటరినా సినియాకోవా (చెక్‌‌‌‌‌‌‌‌) సొంతం చేసుకుంది. ఫైనల్లో ఈ ఇద్దరు 7–6(7/5), 6–3తో ఇటలీ ద్వయం జాస్మిన్‌‌‌‌‌‌‌‌ పౌలిని–సారా ఎరానీపై గెలిచారు. గాఫ్‌‌‌‌‌‌‌‌కు ఇది మూడో డబుల్స్‌‌‌‌‌‌‌‌ టైటిల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం.